బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

Published: Thursday December 01, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... సెప్టెంబర్ నెలాఖరు లోపు వ్యవసాయ రుణాల కింద 3440 కోట్ల రూపాయలు రుణాలు అందించే లక్ష్యం కాగా  1075 కోట్ల రుణాలు అందించి 31% రుణాలను ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. చిన్న,  సూక్ష్మ , మధ్య తరహా పరిశ్రమలకు 1016 రుణాలు అందించే లక్ష్యం కాగా 245 కోట్ల రుణాలు ఇచ్చి 24% లక్ష్యానికి చేరుకోవడం జరిగిందని అని అన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు 1237 కోట్ల రుణాలను అందించవలసి ఉండగా 65 కోట్లు అందించి ఐదు శాతం లక్ష్యాన్ని సాధించిందని అన్నారు. మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 5692 కోట్ల రుణాల లక్ష్యం కాగా 1385 కోట్ల రుణాలు అందించి 24% సాధించడం జరిగిందని  తెలిపారు. ప్రాధాన్యేతర  రంగాలకు 952 కోట్ల రుణాల లక్ష్యం కాగా 430 కోట్ల రుణాలు అందించి 43% లక్ష్యాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లా మొత్తం క్రెడిట్ ప్లాన్ ప్రకారం 6644 కోట్ల రుణాల లక్ష్యం కాగా ఇప్పటివరకు ఒక్క 1815  కోట్లు అందించి 27% లక్ష్యానికి చేరుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.  సెప్టెంబర్ మాసాంత్రం వరకు గృహ నిర్మాణానికి 80 కోట్లు,  ఖరీఫ్ పంట రుణాలకు 855 కోట్ల రుణాలు అందించడం జరిగింది. అదేవిధంగా స్వయం సహాయ సంఘాలకు 538 కోట్ల రుణాలు అందించే లక్ష్యం కాగా ఇప్పటివరకు 293 కోట్ల రుణాలు అందించి 54 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లాకు 6362 కోట్ల రూపాయల క్రెడిట్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కొందరు బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించడంలో వెనుకబడి ఉన్నారని, బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించి లక్ష్యాలను అధిగమించాలని ఆమె తెలిపారు. వివిధ సంక్షేమ శాఖల లబ్ధిదారులకు 2014- 15 నుండి 2017-18 వరకు ఎస్సీ , ఎస్టీ,  మైనార్టీ సంక్షేమ శాఖల లబ్ధిదారులకు సంబంధించిన పెండింగ్ యుసి లను అందించేందుకు ప్రత్యేక క్యాంపులో నిర్వహించి నెల రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి 
** వ్యాపారి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి :  అదన కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో భాగంగా జిల్లాలో ప్రతి వ్యాపారి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ఇందులో భాగంగా గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి వ్యాపారి వివరాలు సేకరించి డిజిటల్ విధానంలో లావాదేవీలు నిర్వహించే విధంగా బ్యాంకర్లు కృషి చేయాలని ఆయన అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి,  డివిజనల్ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని గ్రామ కార్యదర్శుల సేవలను తీసుకుని డిసెంబర్ 6వ తేదీలోపు వివరాలను సేకరించి బ్యాంకర్లకు సమర్పించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 2023-24 రుణ ప్రణాళిక బుక్ లెట్ ను కలెక్టర్ బ్యాంకర్లు,  అధికారులతో తో కలిసి ఆవిష్కరించారు. బ్యాంకర్ల సమావేశంలో డి ఆర్ డి ఓ కృష్ణన్, ఆర్బిఐ ఎల్డిఓ తేజ్ దీపు బహిర, నాబార్డ్ ప్రవీణ్ కుమార్ ఎండిసిసిబి సిఈఓ లక్ష్మయ్య,  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ యూసుఫ్,  ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శ్రీ రామకృష్ణ, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ సుభాష్, డి టి డబ్ల్యూ కోటాజి  , ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజెస్ , మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, డిపిఓ మల్లారెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి అనిత లతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.