క్షౌరవృత్తిని పరిరక్షించాలంటూ మల్లాపూర్ లో నిరసన

Published: Friday February 12, 2021
మండల నాయీ బ్రాహ్మణ అధ్యక్షులు పెండెం శంకర్
మల్లాపూర్, ఫిబ్రవరి 11 ( ప్రజాపాలన ): మంచిర్యాలలో కార్పొరేట్‌ బ్యూటీ సెలూన్‌ ఏర్పాటును నిరసిస్తూ క్షౌరవృత్తిదారులు దుకాణాలు మూసివేసి 25 రోజులుగా మంచిర్యాలలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఒక్కరోజు నిరసనలకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించగా గురువారం మల్లాపూర్ మండల కేంద్రములో మండల నాయీ బ్రాహ్మణ అధ్యక్షులు పెండెం శంకర్ అధ్యక్షతన మండలంలోని నాయీ బ్రాహ్మణలందరూ సెలూన్‌ షాపులు బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించి, తదంతరం సభ్యులందరూ కలిసి తహశీల్దార్ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ మంచిర్యాలలో నాయి బ్రాహ్మణ సోదరులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడం బాధాకరం అన్నారు. మా వృత్తిలోకి కార్పొరేట్‌ సంస్థలు రాకుండా ప్రభుత్వం నిషేధించాలని మా నాయిబ్రాహ్మణులకు ఆర్ధిక తోడ్పాటు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు రాముల వెంకటి, క్యాషియర్ ఓల్లాజి నరేష్, గౌరవ సలహా దారులు కోరుట్ల రాములు, ముత్యలా నర్సయ్య, రాచకొండ నర్సయ్య , మంగలరపు ఆనంద్, టౌన్ అధ్యక్షుడు పసునూరి స్వామి, మరియు  మల్లాపూర్ మండల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.