టిడిపి పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత గాంధీజీ జయంతి వేడుకలు మధిర

Published: Monday October 03, 2022
అక్టోబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుతెలుగుదేశం పార్టీ   కార్యాలయం లొ గాంధీజీ 153వ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి  118 వ జయంతిని పురస్కరించకుని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం , వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారు అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వ్యాపారం పేరుతో భారతదేశం వచ్చిన బ్రిటీష్ వారు వారి ప్రభుత్వాన్ని ఏర్పరచారని అట్టి వారి 200 సంవత్సరాల ప్రభుత్వాన్ని  గాంధీ  సత్యం అహింస సత్యాగ్రహం లను ఆయుధాలుగా చేసుకుని పోరాటానికి నాయకత్వం వహించి గద్దె దించారన్నారు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. తన సమకాలీన సమస్యలైన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు చివరి వరకు  హిందూ ముస్లింల ఐక్యత కోసం పోరాడారన్నారు ఆనేపధ్యంలోనే  గాంధీజీ హత్య గావింపబడ్డారని రామనాధం చెప్పారు గాంధీజీ ఆశయాలమార్గంలోనే అన్న ఎన్టీఆర్, చంద్ర బాబు గర్లు ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు  జనాభాలో సగభాగమున్న మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని, కుల, మత ,వర్గ ,విభేదాలకు తావివ్వని పరిపాలన అందించి బడుగు బలహీన వర్గాలవారికి రిజర్వేషన్లు పెంచారని అలాంటి మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని వర్ధంతిన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ,కేంద్ర  ప్రభుత్వం ఎన్టిఆర్ కు భారతరత్న బిరుదును ప్రధానం చేయాలని రామనాధం కోరారు గాంధీజీ ఆశయాలకు ఆయన పాటించిన విలువలకు పాలకులు  తిలోదకలిచ్చారని ప్రజాస్వామ్య స్థానే నియంతృత్వ పాలనకు తెరలేపారని రామనాధం మాట్లాడుతూ అన్నారు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కొట్టుకోవడం దుర్భాష లాడు కోవటంతో గాంధీజీ కన్న కలలను కల్లలు చేశారన్నారు ప్రజలు వీరికి గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అని అన్నారు టీడీపీ గాంధీజీ ఆశయాలనే శిరోధార్యంగా భావిస్తున్నదని అనితెలియజేశారు ఈ కార్యక్రమంలో శేఖర్ బాబు పట్టణ అధ్యక్షుడు  మల్లాది హనుమంతరావు,   రామకోటి,వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ, ఐ టీడీపీ అధ్యక్షులు అనుమొలు సతీష్, చట్టు వెంకటేశ్వర్లు, గడ్డం మల్లికార్జున, రామ్మోహన్ రావు, రత్నకుమారి, వరమ్మ, కాశీ రావు, రాయప్ప, తదితరులు పాల్గొన్నారు