సవతి తల్లి ప్రేమను ప్రదర్శించకండి : మౌని రామ్ సింగ్

Published: Friday April 16, 2021

బెల్లంపల్లి, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి : పదోవ వేతన కాలపరిమితి ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నా పరిష్కారానికి నోచుకోని అపరిష్కృతంగా ఉన్న సమస్యలుకో కొల్లలుగా ఉన్నాయని ప్రధానంగా సింగరేణిలో గ్రాట్యుటీ చెల్లింపులో అధికారులకు ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయంగ సంస్థ పనిచేస్తూ సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని టి ఎన్టి యు సి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు టీ మనీ రామ్ సింగ్ అన్నారు. కోల్ ఇండియా తో పాటు సింగరేణి లోనూ అధికారులకు నవంబర్  2017 నుంచి పెంచిన గ్రాట్యుటీ రూపాయలు 20 లక్షలు అమలు చేస్తున్నారనీ కార్మికులకు మాత్రం 29 మార్చి 2018 నుండి అమలు చేయడం వల్ల వేలాది మంది రిటైర్డ్ కార్మికులు 20 లక్షల గ్రాట్యుటీ అందుకోలేక పోతున్నారని  కాబట్టి  కార్మికులకు కూడా నవంబర్ 2017 నుండి గ్రాట్యుటీ వర్తింపజేయాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ యజమాన్యం పై ఒత్తిడి తెచ్చి రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ ఇప్పించడానికి కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని టి ఎం ఎన్ టి యు సి నాయకులు తెలిపారు లేనిపక్షంలో దశలవారీ గా అన్ని జిఎం ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మద్దెల రాజనర్సు, అమానుల్లాఖాన్, సిరికొండ కనకయ్య, దుకుట రాజయ్య, గంగాధర్ గౌడ్, బోల్లం మల్లయ్య, చింతల రమేష్, తదితరులు పాల్గొన్నారు.