చింతకాని మండలంలో దళితబంధు అమలుపై మహిళా మండలి అధ్యక్షురాలు ఉమా హర్షం

Published: Thursday September 02, 2021

ఎర్రుపాలెం, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : సీఎం కేసీఆర్ గారికి, మంత్రి అజయ్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్  ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్సీసీ బాలసా లక్ష్మీనారాయణ తాత మధు కృతజ్ఞతలు తెలిపిన. టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఉమాదళితబంధు పథకం అమలకు హుజూరాబాద్నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా చింతకాని మండలం ను సీఎం కేసీఆర్ గారు ఎంపిక చేయడం పట్ల ఎర్రుపాలెం మండల మహిళా అధ్యక్షురాలుహర్షం వ్యక్తం చేశారు.  దళితుల అభ్యున్నతి కొరకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంను గత నెల 16న హుజురాబాద్ లో లాంఛనంగా ప్రారంభించి ఇప్పుడు  రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ  భాగాల్లో ఉన్న, దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపికలో మధిర నియోజకవర్గం చింతకాని మండలంను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడం పట్ల ఖమ్మం జిల్లా దళితుల పక్షాన సీఎం గారికి, మంత్రి అజయ్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ నామా నాగేశ్వరరావు బాలసాని లక్ష్మీనారాయణ తాతమధుశీలం. ఉమా బనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.