పెద్ద గోపతి నుండి విద్యుత్ సరఫరా వేగవంతం మధిర

Published: Friday September 23, 2022
సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో  గురువారం నాడు త్వరలో పెద్దగోపతి నుండి విద్యుత్ సరఫరా వేగవంతం చేస్తున్నట్టు విద్యుత్ శాఖ వారు తెలిపారు ఆంధ్ర నుండి చిల్లకల్లు నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు వచ్చే విద్యుత్ సరఫరా లో తరచూ సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి ఎక్కువ సమయం విద్యుత్  సరఫరా లో అవాంతరాలు ఏర్పడటం లాంటి సమస్యలను పరిష్కరించే దిశలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని పెద్దగోపతి నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా చేసే టవర్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసుకుని ,చివరి దశకు చేరుకున్న తరుణంలో మొత్తం 148 టవర్ల టవర్లకు 146 టవర్ల నిర్మాణం పూర్తయి,  మిగిలిన రెండు టవర్ల నిర్మాణంలో భూ సంబంధిత సమస్యలు తలెత్తడంతో వాటిని పరిష్కరించే చర్యల్లో భాగంగా ఈరోజు టీఎస్ ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ సూపర్నెంటింగ్ ఇంజనీర్ సురేంద్ర  మరియు ట్రాన్స్కో ఎస్ ఈ దీపక్ వాస్నిక్  మరియు టవర్ల నిర్మాణంతో భూమి విలువలు కోల్పోతామన్న ఆందోళనతో ఉన్న భూ యజమానులతో  కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యను పరిష్కరించే దిశగా పలు సూచనలు చేసినారు. త్వరలోనే భూ  సంబంధిత సమస్య లు పరిష్కారమై, ఆగిపోయిన రెండు టవర్ల నిర్మాణం సత్వరం పూర్తి చేస్తామని, త్వరలోనే మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు తెలంగాణలోని ఖమ్మం పట్టణమునకు సమీపానగల పెద్దగోపతి నుండి విద్యుత్ సరఫరా జరగనున్నదని, విద్యుత్ శాఖ వారు తెలిపారు