మాకెందుకు ఈ శిక్ష

Published: Friday March 03, 2023

రాయికల్, మార్చి01;(ప్రజాపాలన ప్రతినిధి): మేమేం పాపం చేశాము.....! మాకెందుకు ఈ శిక్ష.....! నాకు భర్తను లేకుండా చేశావు......! నా పిల్లలకు తండ్రిని లేకుండా చేశావు.... నాకు, నా పిల్లలకు దిక్కెవరు ఈశ్వరా....!! అంటూ కంటతడి పెడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శోకసంద్రంలో విలపిస్తూ అందరి హృదయాలను చలించివేసిన సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే ఇటిక్యాల గ్రామానికి చెందిన కొల్లూరి చంద్రశేఖర్ బతుకు దెరువు కోసం లక్షల రూపాయల అప్పులు చేసి దుబాయ్ వెళ్ళాడు. విధి వక్రంచి ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే హాస్పిటల్ లో చేర్చి చికిత్స చేయించారు. ఇటీవలే ఇటిక్యాల గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు.కాగా విధి ఆడిన వింత నాటకంలో మరల ఇంటి వద్దనే గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తీసుకుపోయే లోపు మరణించాడు.గుంట భూములేని నిరుపేద కుటుంబానికి భార్య లహరి ఇద్దరు చిన్నారులు శివేష్ చంద్ర(10), ఆరాధ్యశ్రీ (8)  అనాధలుగా మిగిలారు. చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.ఆ కుటుంబాన్ని ఆదుకునే వారు లేక బిక్కుబిక్కు మంటూ కాలాన్ని వెల్లడిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని  మానవతావాదులను చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటున్నారు.దాతలు సహాయం చేయాల్సిన ఫోన్ పే నెంబర్ 8179496962, అకౌంట్ నెంబర్ 197012010000169 ఐఎఫ్ ఎస్ సి కోడ్ యుబిఐఎన్ 0819701 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటిక్యాల బ్రాంచ్.ఈ నెంబర్ కు దాతలు దయచేసి ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.