జీవనాధారం కోల్పోతున్నాం

Published: Thursday December 08, 2022
శ్రీ బాలాజీ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు బుచ్చిరాజ్
వికారాబాద్ బ్యూరో 7 డిసెంబర్ ప్రజా పాలన : ఉన్నఫలంగా దుకాణాన్ని ఖాళీ చేయమని ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తున్నాడని శ్రీ బాలాజీ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు బుచ్చిరాజ్ అన్నారు. బుధవారం శ్రీ బాలాజీ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు బుచ్చిరాజ్ మీడియాతో మాట్లాడుతూ గాండ్ల ఉమా శేఖర్ గాండ్ల సంజీవ్ కుమారులకు సంబంధించిన దుకాణాన్ని అద్దెకు తీసుకున్నామని వివరించారు. 2016 నుంచి 2022 ఆగస్టు వరకు దుకాణాన్ని ఖాళీ చేయించమని అగ్రిమెంట్ రాయించుకున్నామని వెల్లడించారు. అడ్వాన్స్ గా 4.5 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. ప్రతి నెలసరి అద్దె 23 వేల రూపాయల చొప్పున 10వ తేదీ లోపు సక్రమంగా చెల్లిస్తున్నామని వివరించారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబాన్ని పోషించుకునేందుకు పిల్లలను చదివించేందుకు ఏకైక జీవనాధారం శ్రీ బాలాజీ ఫుట్వేర్ దుకాణమని గుర్తు చేశారు. కరోనా సమయములో వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు తెచ్చి నెలసరి అద్దె సక్రమంగా చెల్లించామని స్పష్టం చేశారు. అప్పులు తీర్చేందుకు కుటుంబాన్ని  పోషించుకునేందుకు దుకాణం గడువు మరికొంత కాలం పొడిగించాలని కోరారు. బలవంతంగా దుకాణం ఖాళీ చేయిస్తే నా కుటుంబం అంతా రోడ్డు పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణం అద్దె కాలాన్ని మరికొంత సమయం పొడిగించాలని కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామని వివరించారు.
** దుకాణం యజమాని గాండ్ల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ అగ్రిమెంట్ ప్రకారం అద్దెకు ఇచ్చిన దుకాణాన్ని శ్రీ బాలాజీ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు బుచ్చిరాజ్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. నిర్ణీత కాలపరిధి కన్నా ఎక్కువ సమయం ఇచ్చినప్పటికీ దుకాణాన్ని ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్లడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దుకాణాన్ని అద్దెకు ఇవ్వడమే తప్పా అని ప్రశ్నించారు. నా పిల్లలు పెద్దవారగుటచే సొంతంగా వ్యాపారం చేసుకుంటామని అంటున్నారు. దుకాణం కొరకు నా భార్యా పిల్లలతో ప్రతిరోజు గొడవలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ బాలాజీ ఫుట్వేర్ వ్యవస్థాపకుడు బుచ్చిరాజ్ మానవతా దృక్పథంతో ఆలోచించి నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల అధోగతిని పరిశీలించి దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరారు.