తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన

Published: Wednesday July 27, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కో-ఆపరేటివ్ డైరెక్టర్ నక్కపల్లి స్వరూప మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఎంతో మేలు చేస్తున్నాడని ఒకపక్క రైతు బంధు రైతు బీమా అనేక పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. అదే కాకుండా రైతులకు
కెసిఆర్ 5.లక్షల రైతుభీమా రైతు అన్నదాతల కుటుంబాలకు ధీమా అందిస్తుంది ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని  గ్రామాలకు డైరెక్టర్ తెలిపారు మరియు  కొత్తగా భూమి పాస్ బుక్ లు పొందినవారు ఆ పాస్ బుక్ , రైతు మరియు నామినీ ఆధార్ జిరాక్సు పత్రాలతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అని ఆమె తెలిపారు ఇట్టి దరఖాస్తులు
వెంటనే గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి (  ఏఈఓ ) కి దరఖాస్తు చేసుకొనగలరు మక్కపల్లి స్వరూప  తెలిపారు.