వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయట్లేదు

Published: Tuesday November 29, 2022
6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్
వికారాబాద్ బ్యూరో 28 నవంబర్ ప్రజా పాలన : వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయట్లేదని 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ ఆరోపించారు. ఆరవ వార్డుకు సంబంధించి వెంకటాపూర్ తండాలో కౌన్సిలర్ చందర్ నాయక్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 6 శాతం నుండి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకొని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు సన్మానం చేయడం సమంజసం కాదని అన్నారు. 6వ వార్డు అభివృద్ధికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సంప్రదించి నిధులు మంజూరు చేయించుకొని వచ్చానని స్పష్టం చేశారు. మంత్రి ఇచ్చిన నిధులతోనే ఆరవ వార్డును అభివృద్ధి పథంలో పయనించే విధంగా కృషి చేశానని వివరించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ చందర్ నాయక్ కు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వెంకటాపూర్ తండా సమీపములోని పెద్దమ్మ ఆలయం ప్రాంగణంలో గిరిజన జాతి బిడ్డలతో సన్మాన సభ ఏర్పాటు చేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సన్మాన సభ ద్వారా మా గిరిజన జాతి బిడ్డల మధ్య ఎమ్మెల్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానం కలుగుతున్నదని చందర్ నాయక్ విచారం వ్యక్తం చేశారు. స్మశాన వాటిక కొరకు స్థలము కొరకు పోరాడి సాధించుకున్న నేను దారి చూపలేనా అని ప్రశ్నించారు. స్థలము ఇచ్చినవారు దారి ఇవ్వకుండా ఉంటారా అని అన్నారు. స్వయంగా ఎమ్మెల్యే నే వచ్చి స్మశాన వాటికకు దారి చూపగలరా అని సందేహం వ్యక్తం చేశారు.