రోటేరియన్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి

Published: Friday July 01, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 01 జూలై ప్రజాపాలన: నూతనంగా ఎన్నికైన పలు రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులకు అసిస్టెంట్ గవర్నర్ 3150 గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
రోటరీ క్లబ్ భువనగిరి ఫోర్ట్ నూతన అధ్యక్షులు మందడి వెంకట్ రెడ్డి, కార్యదర్శి వారాల రామకృష్ణారెడ్డి , కోశాధికారి సబ్నకర్ వెంకటేష్ మరియు కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు మరియు 2021-22 కార్యదర్శి శ్రీ జిట్ట భాస్కర్ రెడ్డికి మరియు భువనగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు బండారు శ్రీనివాస్ రావు, కరిపే నర్సింగ్ రావు కార్యదర్శి, బోగ హరిక్రిష్ణ కోశాధికారి మరియు కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకురోటరీ సంవత్సరం విజయవంతం కావాలని ఆశిస్తూ పలువురు రోటేరియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు అందజేసిన వారిలో డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి, ఛైర్మన్, మెంబెర్షిప్ ఎక్స్టెన్షన్ తెలంగాణ రీజియన్,గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ రోటరీ 3150 జిల్లా తదితరులు ఉన్నారు.