మత్స్యకార్మికుల అభివృద్దే లక్ష్యంగా సీఎం కెసిఆర్ కృషి

Published: Wednesday November 30, 2022

_ జన్నారం, నవంబర్ 29, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార్మికుల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్  అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందాన్ పెల్లి గ్రామ చెరువులోకి 9 లక్షల చేపపిల్లలను నీటిలోకి వదిలే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన మత్స్యకార్మికుల సొసైటీలను, వారి కోసం వివిధ పథకాలను రాష్ట్రంలో మత్య్స కార్మికుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మండల కో-కన్వీనర్ మున్వవర్ అలీఖాన్, మత్స్య కార్మికులు, జన్నారం మండలం ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.