సర్కార్ బడిలోని చదువుల సరస్వతులను సన్మానించిన జిల్లా పరిషత్ చైర్మన్

Published: Wednesday October 06, 2021
మధిర, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : వినూత్న రీతిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన మాటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలుప్రతిభకు ఏది అడ్డంకి కాదు అని మరోసారి నిరూపించిన మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. పాఠశాల ఉపాధ్యాయిని హిందీ పండిత్ చాంద్ బేగం ప్రోద్బలంతో వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈరోజు స్కూల్ ఆవరణంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికలకు అభినందనలు తెలుపుతున్నాను. మాటూరు ప్రభుత్వ పాఠశాలంటే నాకు ప్రత్యేక అభిమానం. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలకు విద్యనభ్యసించడంలో ముందు ఉంటున్నాయని, ప్రభుత్వ టీచర్లు అన్ని సబ్జెక్టులు చెప్పగల నైపుణ్యం ఉన్నవారిని కనుకనే సర్కారు బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించి ప్రోత్సహించాలన్నారు. మాటూరు ఉన్నత పాఠశాల జిల్లాలోనే మంచి పేరున్న పాఠశాల అని, ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ వివిధ కళలలో అనుభవజ్ఞులని, పిల్లలను తీర్చిదిద్దటంలో ఘనాపాటి అని పేర్కొన్నారు. అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన విద్యార్థిని లైన మేడిశెట్టి నందిని, తోట ప్రత్యూష, చిళ్ళ త్రివేణి, మేడిశెట్టి వెంకట లక్ష్మి లహరి లను శాలువా కప్పి సన్మానించారు. వీరిని ప్రోత్సహించి ఈ ప్రతిభకు కారణమైన హిందీ పండిత్ చాంద్ బేగంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి రామకృష్ణ, వైస్ సర్పంచ్ కాశీ కోటేశ్వరరావు, గ్రామ సెక్రటరీ చిట్టెమ్మ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సభ్యులు కుటుంబ పుతుంబాక కృష్ణప్రసాద్, బాబ్ల, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరూ నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చావా వేణు, ఎంఈఓ వై.ప్రభాకర్రావు, ప్రధానోపాధ్యాయులు సాయి కృష్ణమాచార్యులు, మేడేపల్లి శ్రీనివాసరావు, సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని శ్రీనివాసరావు, వేము రాము, విజయ్ కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు