ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ - గాంధ

Published: Thursday February 17, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /న్యూస్ : తెరాస పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలలో భాగంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన మహా రక్త దాన శిబిరాన్ని కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి రోజా దేవి రంగరావు, కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతు. సీఎం కేసీఆర్ జన్మదినం ను పురస్కరించుకుని మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి నాతో పాటు 300 మంది రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి స్పందన వచ్చినది అని, అన్ని దానంల కన్నా రక్తదానం గొప్పది అని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారు అవుతారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ఇతర ప్రాణాలు కాపాడిన దైవ సమానులు అవుతారు అని కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛంద గా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని .సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక సంబరంగా జరుపుకుందామని, ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,బంగారు తెలంగాణరథసారథి,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు,  జనహృదయ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు నా తరుపున హృదయపూర్వక ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని , ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్ల జీవించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ,ప్రాణాలకు తెగించి, కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప యోధుడు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి, మన తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ దని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చివరి వరకు అందేలా వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, రాష్ట్ర ప్రగతిని మున్ముందుకు తీసుకోపోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, రెండు సార్లు ముఖ్య మంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలలో చిరునవ్వులు, వెలుగును నింపిన మహానుభావుడు అని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అలరిస్తూ జనరంజకమైన పాలనా తో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశలో అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతఘ్నతలు తెలియ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తున్నాని, ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధికి శాయషెక్తుల కృషి చేస్తున్నాని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్ డెంట్ డాక్టర్ వరద చారి, మాజీ కార్పొరేటర్లు రవీందర్ ముదిరాజు, రంగరావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజు యాదవ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, సమ్మారెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు