దేశాన్ని కాపాడే శక్తి కేవలం మోడీకి మాత్రమే ఉంది *బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని మోసం చేస్తున్న కే

Published: Tuesday October 18, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్ గ్రామంలో సర్పంచ్ కాయితి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి తో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు బ్రహ్మరథం పలకగా మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రచార రథం పై మాట్లాడుతూ తెలంగాణ మొత్తం మునుగోడు వైపు చూస్తుందని,మునుగోడు ప్రజలకోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి త్యాగం చేశాడని అన్నారు.కెసిఆర్ ఎన్నికలలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకుని ప్రజలను ఇబ్బందులపాలుజేశారన్నారు.
రాష్ట్రం వస్తే ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని నమ్మి గెలిపిస్తే. కెసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేశాడని విమర్శించారు. రెండో సారి ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందని మరోసారి అవకాశం ఇవ్వండని గెలిచి మరోసారి మోసం చేశారన్నారు.
ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, నిరుద్యోగ భృతి కల్పిస్తానని, మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశాడని విమర్శించారు.
రైతు బందుతో చిన్న రైతులకు ఏం లాభం లేదని ర్రాష్ట సంపద మొత్తం భూస్వాములు దోచిపెడ్తున్నారని మండిపడ్డారు.
టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల బంధువులకు దళిత బందు ఇచ్చారు కానీ. పేద ప్రజలకు ఇవ్వలేదని అన్నారు.
1200మంది త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులైన
గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబెర్,ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్లకు అసలు గౌరవమే లేదన్నారు.రెండు ఎకరాల భూమి ఉన్న కెసిఆర్ కు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
తెలంగాణా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశాన్ని మోసం చేస్తున్నారని తెలిపారు.
ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి చెందుతుందనే విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు.
అందుకోసమె రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు.
దేశాన్ని కాపాడే శక్తి కేవలం మోడీ కె ఉందన్నారు.
ఉగ్రవాదం నుండి భారత దేశాన్ని కాపాడుతున్నాడని తెలిపారు.
కాంగ్రెస్ కేవలం రెండు రాష్ట్రాలలొనే ఉందని,
రాబోయే రోజుల్లో అది కూడా కనుమరుగవుతుందన్నారు.
హుజురాబాద్ లో ఈటెలను గెలిపించినట్టుగానే మునుగొడులో రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రిక్కల సుధాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఏసబోయిన కృష్ణ యాదవ్, ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ దూర్క కృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కాయతి కిషన్, బద్దం పాండు రెడ్డి, సంజీవ లింగస్వామి, పాక వెంకటేశం, గౌరెల్లి కృష్ణ, బీర్ల లింగస్వామి, ఎదగని శ్రీనివాస్, శ్రీలత, పూజ, అలివేలు, పుష్పమ్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.