సహకార సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Published: Wednesday August 24, 2022

బోనకల్, ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి: రైతులు సహకార సంఘాలను సద్వినియోగం చేసుకొని వాటి బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణయ్య లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కలకోట గ్రామంలో రూ. 43 లక్షలు నాబార్డు నిధులతో నిర్మించిన సొసైటీ భవనాన్ని, గిడ్డంగిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ఈ గోదాములలో నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. సహకార సంఘాల ద్వారా సబ్సిడీ తో అందించే ఎరువులను, విత్తనాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలకోట సహకార సంఘం అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, సర్పంచ్ యంగల దయామణి, ఎంపీటీసీ యంగల మార్తమ్మ, డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బంధం శీను, మాజీ జడ్పీటీసీ బానోతు కొండా, టిఆర్ఎస్ నాయకులు చావా లక్ష్మణరావు, మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగం రవికుమార్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.