తిప్పాయిగూడ గ్రామంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సదర్ సమ్మేళన

Published: Saturday November 05, 2022

మంచాల మండలం తిప్పాయిగూడ గ్రామంలో  శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న *అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్వర్ యాదవ్ , ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ యాదవుల ఆత్మగౌరవానికి యాదవుల ఐక్యమత్యానికి  సదర్ సమ్మేళన నిదర్శనం అన్నారు, యాదవులు అన్ని  రంగాలలో ముందుండాలని కోరారు, యాదవులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని  అన్నారు,అదేవిధంగా విద్యార్థులు  విద్యలో ముందుండాలని చెప్పారు, మన జీవన విధానంలో మనతో పాటు జీవిస్తూ మానవ మనుగడకు పశువులు ఎంతగానో ఉపయోగపడుతున్నావని తెలిపారు పశువుల ద్వారా మనం ఎంతో ఆర్థిక పోరోగతిని సాధిస్తూ ఆర్థికంగా బలపడుతున్నామని అన్నారు మనం జీవించడానికి ఉప గోయపడుతున్న పశువులను అలంకరణ చేసి వాటి పూజలు చేసి పశువుల గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని  అదేవిధంగా యువతి యువకులు చెడు మార్గాల వైపు పోకుండా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందాలని అన్నారు,ఈ కార్యక్రమంలో  తిప్పాయిగూడ గ్రామ సర్పంచ్ శివరాల పాండు,  పెద్ద గొల్ల మరమోని జంగయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, కొమురయ్య యాదవ్,అఖిల భారత యాదవ సంఘము నాయకులు ఎల్గపల్లి శ్రీరామ్ యాదవ్, పొలమోని మహేష్ యాదవ్,దాయ్ నవీన్ యాదవ్, శ్రీశైలంయాదవ్, రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, శంకర్ యాదవ్,జంగయ్య యాదవ్, మరియు గ్రామ యాదవ్ సంగం నాయకులు పెద్దలు యువకులు, తదిదర్లు పాల్గొన్నారు,