దాసిరెడ్డిగూడెం గాంధీనగర్ వాసులకు న్యాయం చేయండి

Published: Thursday October 28, 2021
యాదాద్రి అక్టోబర్ 27 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది  మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెంలోని గాంధీనగర్ కాలనీవాసుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) కిసాన్ మోర్చా మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బందారపు రాములు బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1992 సంవత్సరంలో ఆనాడు నల్గొండ ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంయుక్తంగా పరిపాలన సమయం వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో (రెడ్లరేపాక గ్రామపంచాయతీ విభజన జరగక ముందు) పరిధిలో దళితులకు. వెనకబడిన కులాలు బీసీలకు. ఇతర కులాలకు సంబంధించిన ఓసి. నిరుపేదలకు. ఇంటి స్థలాల కొరకు గ్రామంలోని భూమి సర్వే నెంబరు 354 లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పట్టాదారులు రావుల చెన్న మల్లారెడ్డి తండ్రి చంద్రారెడ్డి ఎ 1.95 సెంట్లు రావుల బుచ్చిరెడ్డి తండ్రి చంద్రారెడ్డి 0.50 సెంట్లు రావుల యాదగిరి రెడ్డి తండ్రి చంద్రారెడ్డి ఎ 1.90 సెంట్లు మొత్తం 4 ఎకరముల 35 సెంట్లు భూమిని కొనుగోలు చేసి 87 ప్లాట్లుగా విభజించి 87 మంది లబ్ధిదారులకు ఆనాటి మాజీ శాసనసభ్యులు గుర్రం యాదగిరిరెడ్డి ద్వారా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. గృహములు నిర్మించుకొని ఆ యొక్క గృహములలో సంసారం చేసుకుంటూ జీవిస్తున్నారు. నేటికి సుమారు 29 సంవత్సరాలు కావస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన సందర్భంలో మా యొక్క గ్రామం కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీ గా ఏర్పడింది. 1992 సంవత్సరం నుండి ఈనాటి వరకు ఉమ్మడి గ్రామపంచాయతీలో ఐదుగురు (5) సర్పంచులు మారిపోయారు. ఈనాడు కొత్తగా ఏర్పడిన మా గ్రామ పంచాయతీకి సర్పంచిగా. కొమురెల్లి సరితా సంజీవరెడ్డి. ఎన్నికయింది. ఐదుగురు సర్పంచుల పరిపాలనలో గ్రామంలో ఎలాంటి సమస్యలు లేక గ్రామ ప్రజలందరూ. కలిసిమెలిసి సోదర భావంతో జీవించారు. ప్రస్తుతం సర్పంచ్ పదవిలో కొనసాగుతున్న సర్పంచ్ భర్త కొమురెల్లి సంజీవరెడ్డి. ప్రజల మధ్య సమస్యలు సృష్టిస్తూ. తన ఇష్టమున్న అరాచకాలు చేస్తూ ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇదే క్రమంలో 1992 సంవత్సరంలో. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి ఇచ్చిన ప్లాట్లు అందులో భూమి హెచ్చుతగ్గులుగా ఉన్నదని పేర్కొంటూ అక్రమ సంపాదనకు స్వార్ధ సంపాదనకు ఇచ్చిన ప్లాట్లలో భూమి ఎక్కువగా ఉన్నదని ఆరోపణ చేస్తూ అధికారులతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ప్రజలను బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై స్థానిక ఎంపిడిఓ. తహసిల్దార్ లకు. వినతి పత్రం సోమవారం రోజున ఇచ్చిన అధికారులు పేదలకు న్యాయం జరగకుండా. ఎలాంటి చర్యలు తీసుకోకుండా.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సర్పంచ్ భర్త కొమురెల్లి సంజీవరెడ్డి. ఇండ్లు నిర్మించుకొని. జీవిస్తున్న పేదల ఇండ్ల ప్రక్కనున్న కొద్ది పాటిగా నున్న కోసుమూలలలో ఉన్న భూమి అమ్ముకోని సొమ్ము చేసుకోవాలను కుంటూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని. ఇప్పటికైనా సర్పంచ్ భర్త కొమురెల్లి సంజీవరెడ్డి గ్రామంలో చేస్తున్నా అక్రమ ధనార్జన ప్రయత్నాలు నిలిపివేసి. అధికారులు స్పందించి గాంధీనగర్ ప్రజలు న్యాయం చేయాలని  కోరుతున్నారు. ఈ సమావేశంలో కొనపూరి లింగస్వామి, దాసరి శ్రీనివాస్, కొమ్ము లక్ష్మయ్య, పత్తెపు లక్ష్మయ్య, రాసూరి ఐలయ్య, రాపోలు నరేష్, రాపోలు అనిల్, రాపోలు ఎల్లయ్య, అంగోతు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.