అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి

Published: Tuesday April 27, 2021
సిద్దిపేట ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
కోమటిచెరువుకు కోట్లు ఖర్చు పెట్టావు ఎంతమంది యువతకు ఉపాధి దొరికింది.
స్వతంత్ర అభ్యర్థులకు ఓటువేస్తే మళ్ళీ మంత్రి వద్దకే వెళతారు.
అభివృద్ధి చేస్తే సహకరించేవాళ్ళం కానీ ఇది అవినీతి ప్రభుత్వం.
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : కోమటిచెరువు అభివృద్ధి పేరుపై కోట్ల రూపాయలు పెట్టారు, దానివలన ఒక్క గుంటకాయినా నీళ్ళందయ్యా, అన్నికోట్లు ఖర్చు చేస్తే ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షో లో టి ఆర్ ఎస్ నాయకుల అవినీతిని రూపుమాపేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు చెపుతున్నట్టు ఇది మిల మిల మెరిసే సిద్దిపేటలా లేదని అభివృద్ధి పేరు చెప్పి సాగించిన అవినీతికి నిదర్శనంగా మారిందన్నారు.డబుల్ బెడ్ రూమ్ ల లబ్ధిదారుల లిస్ట్ ఇప్పటికీ ఇవ్వట్లేదని, అసలు డబుల్ బెడ్ రూమ్ లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, కేంద్రం ఇచ్చిన నిధులు ఎటువైపు దారి మళ్లాయో తెలపాలన్నారు. 6762 మంది వీధి వ్యాపారులకు 10 వేల చొప్పున 7 కోట్ల పైచిలుకు రూపాయలిస్తే అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు చూపుతున్నారన్నారు. అమృత్ పథకం కింద లబ్ది పొంది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. కరోనా సమయంలో పిపియి కిట్లు, వెంటిలేటర్ లతో సహా ప్రతీది కేంద్రం ఇచ్చినవే అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారైనా రేషన్ కార్డుల మార్పుకాని, కొత్త రేషన్ కార్డుల మంజూరు కానీ చేసిన దాఖలాలు లేవన్నారు. గతంలో నీళ్ళ మంత్రిగా, మైన్స్ మంత్రి గా ఉన్న నిన్ను ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి మళ్ళీ మంత్రి పదవి పొందిన విషయం అందరికీ తెలుసన్నారు. పైన పటారం లోన లోటారం లా అభివృద్ధి ఉందని ఓపెన్ ఆడిటోరియం పేరుతో కోట్లు దోచుకున్నారన్నారు.ఆనాడు ఉద్యమంలో 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ 50 పైసల అగ్గిపెట్టే దొరకలేదా అని ఎద్దేవాచేశారు. రాష్ట్రం లో చేతగాని ముఖ్యమంత్రి వల్లనే ఈ కోవిడ్ దుస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పుడంటే కరోనా వచ్చింది కానీ ఇంతకు ముందు ఒక్కటంటే ఒక్కటైన సమీక్ష నిర్వహించాడా అని ప్రశ్నించారు. కోవిడ్ పై పోరాడుతున్న వైద్య ఉద్యోగుల కు కనీస సౌకర్యాలు కల్పించట్లేదని, మరణాల సంఖ్య తక్కువగా చూపిస్తున్నారని విలేకరులే ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారని, హెల్త్ కార్డులు పనిచేస్తున్నాయన్నారు. కేంద్రం ఫ్రీ గా ఇస్తుందని ప్రకటించిన కోవిడ్ వ్యాక్సిన్ కు 2500 కోట్లు మంజూరు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మంత్రి కి చెంచాగిరి చేసేవారే చైర్మన్ అవుతారని నిధులిచ్చే పార్టీ బీజేపీని ఒక్కసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.