న్యూస్ 5 హెడ్లైన్స్ పెట్టండి సార్

Published: Tuesday February 07, 2023

ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి

*ఎమ్మెల్యే  సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ* 

*మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి(బంటి)*


*రంగాపూర్ చౌరస్తాలో సంతు సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
*ఆంబోతు తండాలో సంక్షేమ అభివృద్ధి పనుల కోసం సుమారు 3 .61  కోట్ల ఖర్చు
*సిసి రోడ్లు డ్రైనేజీ పునరుద్ధరణకు 5. లక్షల మంజూరు
*ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం


ప్రగతి నివేదన యాత్ర లో భాగంగా 15 రోజు చేరుకొని ప్రజా సమస్యలపై
గ్రామంలో గడపగడపకు చేరుకొని వారికున్న సమస్యలను ఇబ్బందులను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టుకునే విధంగా చూస్తామని ఇల్లు లేని పేదవాడికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని అక్కడున్న ప్రజలకు సూచించారు. అవే కాకుండా రేషన్ కార్డులు పింఛన్లు
అనేకమైన సమస్యల పైన తెలుసుకొని వారితో చర్చించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీర్చే విధంగా చూస్తామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంచాల మండలంలో రంగాపూర్ చౌరస్తాలో లంబాడీల ఆరాద్యా దైవం సంతు సేవాలాల్ మహారాజ్  విగ్రహాన్ని రంగాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
యువతకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడా సామాగ్రి యువతకు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి నివేదన యాత్రలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య , మంచాల మండలం ఎంపీపీ నర్మదా లచ్చిరాం,   మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేష్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, తాళ్లగూడ ఎంపీటీసీ సుకన్య, ప్రధాన కార్యదర్శి బహుదూర్,   సర్పంచ్ రఘు బిక్ష నాయక్, ఉప సర్పంచ్ బద్రీనాథ్ గుప్తా, గ్రామ కార్యదర్శి  శాఖ కార్యదర్శి హరికృష్ణ, నాయకులు సికిందర్. రవి. పట్నాయక్, బాలు., టిల్లు., అంజమ్మ, బి వై ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.