ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక* *వ్యవస్థాపక అధ

Published: Tuesday January 10, 2023
అబ్దుల్లాపూర్మెట్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి, ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
బి జే హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  గగనం మంతప్ప, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్  నాయకులు వ్యవస్థాపకులు శ్రీనివాసులు, ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ జాబితాలో ఉన్న బేడ బుడగ జంగాలకు ప్రతి కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 ఉపకులాల్లో ఒకటని రాజ్యాంగం కల్పించిన హక్కులు రిజర్వేషన్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికీ మా బేడ బుడగ జంగాలకు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా బేడ బుడగ జంగాలు తమ కళ్ల రూపాలతో అనేక ఉద్యమంలో పాల్గొన్నారు గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రము ఏర్పడి ఎనిమిది ఏళ్లు గడుస్తున్న విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రాజకీయ సంస్కృతిక రంగాలలో ఎలాంటి ప్రతినిత్యం లభించడం లేదు అన్నారు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బేడ బుడగ జంగం నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా సిరువాటి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గగనం వెంకటస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తూర్పాటి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సిరివాటి మసికొండ, కడవంచి నరసింహ, గడ్డం కృష్ణయ్య, సిరివాటి రామకృష్ణ , రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులుగా దూపం అంజనేయులు, రాష్ట్ర సంస్కృతిక కార్యదర్శిగా తూర్పాటి శివ,రాష్ట్ర కార్యదర్శులుగా
తూర్పాటి హనుమంతు, గగనం సహదేవుడు, మిర్యాల కిరిటీ,గగనం తిరుపతయ్య, గగనం రాజు, బయల్పాటి అంజి, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎడవెల్లి భాస్కర్,రాష్ట్ర సహాయ కార్యదర్శులుగాగగనం ముత్తమయ్య, సిరిశాల శీను మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లా నుంచి శిరీషాల వెంకటేష్, టేకు ప్రకాష్ నిర్మల్ జిల్లా, యూత్ ఫెడరేషన్ కన్వీనర్లుగా మోతే మధు, గగనం సాయి నారాయణ,సిరిగిరి శివ, కడమంచి నర్సింహులు,
గడ్డం గంగన్న నిర్మల్ జిల్లా,రేవెల్లి బ్రెమేష్ అమరచింత,
యూత్ ఫెడరేషన్ గా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ లో పని చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళను కూడా కలుపుకుని కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన తెలిపారు.
ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి  పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అయన తెలిపారు.నూతన అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ సేవలు గుర్తించి నన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఏనుకున్న సందర్భంగా వ్యవస్థాపక కమిటీకి రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో మీ అందరి చేయూత ఇచ్చిన ప్రకారం మీ అందరి ఇచ్చిన బాధ్యతను తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎన్నికల్లో భాగంగా ఈరోజు నన్ను ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతని మనసా వాచకమైన కొనసాగిస్తాను వచ్చే మన రాష్ట్రంలో వచ్చే ఏ నిధులైన బేడ బుడగ జంగం తరఫున నేను ప్రభుత్వాన్ని ఖండించి దిశగా పయనిస్తాను అందరూ నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బేడ బుడగ జంగాలకు అందరికీ నేను పని చేస్తాను అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.