చిన్నారిని దీవించిన సర్పంచ్ మారెళ్ల మమత..

Published: Monday January 10, 2022
తల్లాడ, జనవరి 9 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారు గూడెం గ్రామానికి చెందిన పొన్నం వెంకటయ్య, రుద్రమ్మ మనమరాలు ఓనీల అలంకరణ వేడుక ఆదివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ సర్పంచి మారెళ్ళ మమత హాజరై చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు (కేవీ), నాయకులు పొన్నం కృష్ణయ్య, పులి వెంకటనరసయ్య, తవిడిశెట్టి యుగంధర్, గోపాలపేట ఉపసర్పంచ్ చల్లగుండ్ల కృష్ణ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్.యాకూబ్ పాషా ఉన్నారు.