అమ్మ వారి చల్లని దీవెనలు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. -ఉద్యమకారుల చేవెళ్ల పార్లమెంట

Published: Tuesday October 04, 2022

చేవెళ్ల,అక్టోబర్ 03(ప్రజాపాలన ):


దసరా నవరాత్రి ఉత్సవాలలో భక్తులు నిష్టతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని  ఉద్యమకారుల చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వర్ రెడ్డి సొంత గ్రామమైన
చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామం లో నవరాత్రుల ఉత్సవా నిర్వహణలో ఆయన భాగస్వాములు అయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం హాజరై అల్లవాడ మాజీ సర్పంచ్ అత్తిలి కృష్ణారెడ్డి, శంకర్ రెడ్డి సత్తిరెడ్డి దర్శన్ రామచంద్రయ్య మల్ రెడ్డి పాండురంగారెడ్డి లతో కలిసి దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వసంతం,యాలాల మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ...
ప్రతియేటా అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అభినందనీయమన్నారు.నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు భక్తి మార్గం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు భక్తితోపాటు సేవ భావాన్ని కలిగి ఉండాలన్నారు. సమయానికి వర్షాలు గురించి పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సంతోషంగా ఉండేలా అమ్మవారు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అదేవిధంగా
పాండురంగారెడ్డి కుమారుడు శంకర్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో... రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ అనీఫ్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బేగరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కే.సత్యనారాయణ, మండల నాయకుడు ఎం.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.