బోనకల్ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేసిన సీఐ, ఎస్ ఐ

Published: Wednesday February 23, 2022
బోనకల్, ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో ప్రధాన కూడాలి నందు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ ఆధ్వర్యంలో బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో వాహనదారులను వాహనాలకి సంబంధించిన పత్రాలు లేకుండా ప్రయాణించే వారికి, నంబర్ ప్లేట్ లేని వాహనదారులకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, హెల్మెట్లు లేకుండా ప్రయాణించే వారికి,డ్రంక్&డ్రైవ్ చేసే వారికి, సూచనలు తెలియ పరుస్తూ వాహనాలు నడిపే మైనర్లుకు జరీమానాలతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం కాగా, వాహనాలను మైనర్లుకు ఇచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదని, తల్లిదండ్రులు పిల్లల విషయంలో పట్టింపుగా లేకపోతే అనవసరంగా పోలీసు వారితో ఇబ్బందులు పడవలసి వస్తుందని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.