దూసుకుపోతున్న చలో చూద్దాం ** యూట్యూబ్ ఛానల్ *

Published: Saturday October 08, 2022

ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 06 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఉరుకులు, పరుగుల, జీవితంలో ప్రజలందరూ ప్రతిరోజు బిజీబిజీగా విమానం కంటే వేగంగా ప్రయాణిస్తున్న ఈరోజుల్లో ప్రశాంతత కోసం  ఒక నిమిషం గడిపేందుకు ఎదురు చూస్తాం.! ఆ నిమిషమే ప్రకృతిలో అయితే మనసుకు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ ప్రశాంతత కోసం ఎక్కడో వైజాగ్, బెంగళూర్, చెన్నై, కి వెళ్లాల్సిన అవసరం లేదు. అవును ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే' మన కొమురం భీం జిల్లాలో ఎన్నో ప్రకృతి అందాలు ఆరబోసిన ఇలాంటి కొత్త ప్రదేశాన్ని చలో చూద్దాం యూట్యూబ్ ఛానల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీం పరిచయం చేసింది. ఇప్పుడు ఒక "హాట్ టాపిక్ గా మారింది". అంతేకాదండోయ్ అక్కడ కారు అడవిలో ఒక వ్యక్తి జీవితాన్ని కూడా పరిచయం చేసింది. రాత్రి ఒక్కడే కాలం గడుపుతూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇలా మరెన్నో ప్రకృతి అందాలు కొమురం భీం జిల్లా చలో చూద్దాం..యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో మరిన్ని వింతలు విశేషాలను మన ముందుకు తెబోతుంది. ఇప్పటికే వీక్షకుల మెప్పు పొంది ప్రజాదరణ పొందింది.