ఆరోగ్యవంతులే దేశానికి రక్షణ కవచం

Published: Thursday March 25, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి ససు
కడప జిల్లా ప్రతినిధి మార్చి 24 ( ప్రజాపాలన ) : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి ఆగష్టు, 2022 నాటికి 75 వసంతాలు పూర్తి కావస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 75 వారాలపాటు అమృత్ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేశారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మొదటి వారంలో భాగంగా ఎన్నెపల్లి నుండి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వరకు 2 కిలో మీటర్ల ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగినది. ఇందులో జిల్లా కలెక్టర్, జిల్లా SP, జిల్లా అదనపు కలెక్టర్, ఏఎస్పిలు పాల్గొని జెండా ఊపి ఫ్రీడమ్ రన్ ను ప్రార్సంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలో అజాదీకె అమృత్ మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక సంవత్సరం పాటు ప్రతి వారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆగష్టు, 2022 వరకు అన్ని శాఖల అధికారులు దేశ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కోవిడ్ మహమ్మారి వచ్చి నేటికి సంవత్సరం అయ్యిందని, ఇట్టి కాలంలో వివిధ శాఖల అధికారులు లాక్ డౌన్ సమయంలో మంచి సేవలు అందించారని, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించారని అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పిఎం.నారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున 75 వరాల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామని తెలిపారు. యువత అందరు ఆరోగ్యంగా ఉంటే దేశానికి మంచి సేవలు అందించ గలుగుతారని తెలిపారు. దేశ అభివృద్ధి కొసం ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. రెవిన్యూ, పోలీస్ శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు రన్ లో పాల్గొన్నందుకు ధన్యవాదములు తెలిపారు. పరుగులో మొదటి, రెండవ, మూడవ స్థానంలో వచ్చిన వారికి కలెక్టర్ మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, అడిషనల్ ఎస్పి ఎంఏ రషీద్, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, డివైఎస్ఒ హన్మంత్ రావు, డిటిడిఒ కోటాజి, డిఏఒ గోపాల్, ఏఒ హరిత, కలెక్టర్ తహసీల్దార్ సుధా, ఈడిఎస్సి కార్పొరేషన్ బాబు మోజెస్, మున్సిపల్ కమీషనర్ భోగేశ్వర్లు, చిగుళ్లపల్లి రమేష్, కౌన్సిలర్ లు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.