విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి ** పిడిఎస్యు జిల్లా కార్యదర్శి తిరుపతి ** మోడల్ స్కూ

Published: Friday September 16, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్15 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు అందించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ప్రభుత్వ మోడల్ స్కూల్లో పిడిఎస్యు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో 4 నెలలుగా గడుస్తున్న పూర్తిస్థాయిలో నేటి వరకు విద్యార్థులు చదువుకోవడం కోసం కనీసం పాఠ్య పుస్తకాలు కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పుస్తకాలు లేకుండా పాత పుస్తకాలు  కొంతమందికి మాత్రమే ఉండడంతో మిగతా విద్యార్థులకు చదువుకోవడం ఎలాగో తెలియని పరిస్థితి ఉందన్నారు. మిల్క్ కూడా చాలా తక్కువ రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని, అలాంటప్పుడు విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా సాధ్యం అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి కామ్రేడ్ జార్జిరెడ్డి అందించిన 50 ఏళ్ల ఏమరత్వ స్పూర్తితో భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ, విద్యార్థి సంఘం పిడిఎస్యు లోకి ఆహ్వానించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు సహాయ కార్యదర్శి కళ్యాణ్, అజయ్,ప్రదీప్, శివ భారత్, తదితరులు పాల్గొన్నారు.