ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్ లో 3 వేల కోట్లు క

Published: Thursday January 12, 2023

- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కామ్రేడ్ పాషా,నరహరి స్మారక కేంద్రంలో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దగ్గర  వడ్డె ఓబన్న 216 వ జయంతి జరిగింది. ఈ కార్యక్రమాన్నికీ ముఖ్య అతిథిగా చేతి వృత్తిదారుల రాష్ట్ర నాయకులు ర
లేల్లల.బాలకృష్ణ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు.విఘ్నశ్  పొల్గోన్ని మాట్లాడుతూ  వడ్డె ఓబన్న స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పాలే గాళ్ళ  పోరాటంలో చేశారు ముఖ్యంగా వడ్డే ఓబన్న అనాడు బిటిష్ ప్రభుత్వం పెంచిన పన్నులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకోని పెద్ద ఎత్తున పోరాటాలు చేశారన్నారు. అంతే కాకుండా ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి ముఖ్యఅనుచెరుడుగా సర్వశైనా అధ్యక్షులు కూడా పనిచేశారని అన్నారు.జిల్లాలో , వడ్డెర వృత్తిదారులు సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, భరాజకీయంగా వేనుకబడి ఉన్నారన్నారు. వడ్డెరలు రెక్క అడితే గానీ డొక్కని బతుకులు అన్నారు. వడ్డెరలకు వడ్డెర బంధును వేంటనే ప్రకటించాలని ప్రభుత్వాని ఢిమాండ్ చేశారు. వడ్డెరలకు ప్రమాద భీమా కల్పించారన్నారు. 50 సంవత్సరాలు నిండిన వడ్డెర లకు 3016 రూపాయాల ఫింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.వడ్డెరలకు ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారని కోరారు .బడ్జెట్ లో 3000 వేర కోట్ల రూపాయాలం కేటాయించాలనీ డిమాండ్ చేశారు. నేడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విపరీతమైన పనులు పెంచుతూ ప్రజలపై తిను బారాలు నూకుతున్నారని వాటికి వ్యతిరేకంగా వడ్డెర వృత్తిదారులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అంతే కాకుండా వృత్తిదారుల హక్కులు సాధించాలంటే కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర నాయకులు చేతివృత్తి సమన్యయ కమిటి జీల్లా కన్వనర్ గొరెకంకల. గోరింకల నరసింహ  సిఐటియు సిహెచ్ సిహెచ్ ఎల్లేష్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.