శ్రీ బాల గణేష్ ఆసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పంపిణీ

Published: Monday February 22, 2021
మధిర ,ఫిబ్రవరి 21, ప్రజాపాలన: ఈ రోజు దెందుకూరు గ్రామ నివాసులు ముచ్చింతాల. వీరభద్రం అయన భార్య లక్ష్మీనరసమ్మకు షుగర్ వ్యాధితో చెరొక కాలు తొలగించడాన వారి వైద్య సహాయం కొరకు రూ.25,000/- చెక్కును మరియు ఆటో ప్రమాదంలో రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయిన సుగ్గల. నాగేశ్వరావుకు రూ.10,000/- చెక్కును గూడపాటి.శేషయ్య గారు(బెంగళూరు), నూకవరపు.మోహనరావు గారు (కర్నూల్), బత్తినేని.శేఖర్ గారు(అమెరికా), మాగం.భవాని, పంటి .శ్రీను గార్ల సౌజన్యంతో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అయితం. వెంకటేశ్వరావు గారి చేతుల మీదుగా చెక్కులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సభ్యులు అయితం. రామారావు, బండ్లమూడి.శ్రీను, వలీ, వెంకటేశ్వరావు, సతీష్, కోటి, నరేంద్ర, రాఘవ, పరమేశ్వరావు, అల్లూరి.నాగేశ్వరావు, వాడపల్లి. బాబు తదితరులు పాల్గొన్నారు.