ఘనంగా ఇంజనీర్ కనకరత్నం ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను

Published: Friday September 17, 2021
హైదరాబాదు 16 సెప్టెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : 75వ భారత దేశ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణం లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రోడ్లను పరిశీలించిన వివిధ రాష్ట్రాల ఇంజనీర్ల బృందం. బేస్తవారం నాడు ఉదయం వివిధ రాష్ట్రాల పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ల బృందం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లోని దౌలతాబాద్ నుండి కోక్యా తాండా వయా మూసాపేట వరకు నిర్మాణం చేసిన రోడ్డును పరిశీలించినారు. ఈ రోడ్డు అంచనా విలువ రూపాయలు 285.50 లక్షలు పి.ఎమ్.జి.వై. నిధుల నుండి మంజూరి చేయబడింది. దాదాపు 5 కీలో మీటర్లు టెర్రజైమ్ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేసిన రోడ్డు పనిని పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ గజం సీతారాములు మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసిన ఇంజనీర్ల బృందం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ లో బాగంగా పరిశీలించారు. షెల్ ఫిల్లింగ్ కాంక్రీటు అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 800 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం మరియు టెర్రజైమ్ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 4.23 కిలో మీటర్ల వరకు బిటి రోడ్డు నిర్మాణాన్ని ఎలా చేశారో సంబంధిత డిఇఇ మరియు ఎఇ లు వివరించారు. ఈ రోడ్డు ను ఎమ్.యస్.ఎస్.యల్.యం.ఐ.ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టారన్నారు. మెదక్ రీజియన్ పరిధిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.