ఆలంపల్లి దర్గా ఉత్సవాలు ప్రారంభం

Published: Saturday February 20, 2021

దర్గా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ ఖాద్రి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి 19 ( ప్రజాపాలన ) : హజ్రత్ ఆలం షహీద్ రహమతుల్లా అలై హుస్సేన్ షహీ రహమతుల్లా అలై ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని దర్గా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు (సదర్) మహమ్మద్ షరీఫ్ ఖాద్రి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి దర్గాలో మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా సాంప్రదాయాలను అనుసరిస్తూ నిర్వహిస్తున్న ఉత్సవానికి అందరూ ఆహ్వానితులేనని వివరించారు. వికారాబాద్ లోని జామియా మస్జీద్ (పెద్ద మస్జీద్) నుండి ఆలంపల్లి దర్గా వరకు గంధం ఊరేగింపును దర్గా కమిటీ యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుండి గంధం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. గంధం ఉత్సవం అనంతరం ఖవాలి కార్యక్రమం దర్గా కమిటీ అధ్యక్షుడు ( సదర్ ) మహమ్మద్ షరీఫ్ ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహింపబడునని తెలిపారు. శనివారం రాత్రి 8 గంటలకు జామియా మస్జీద్ (పెద్ద మస్జీద్)  నుండి ఆలంపల్లి  దర్గా వరకు గంధం ఊరేగింపు కార్యక్రమాన్ని రెండవ రోజు కూడా కొనసాగుతుందని అన్నారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి తెల్లవారు జాము 5 గంటల వరకు ఖవాలి కార్యక్రమాన్ని గుల్బర్గాకు చెందిన తన్వీర్ ఖవాల్ నిర్వహిస్తారని వివరించారు. ఆదివారం ఉదయం 6 నుండి అన్నదానం కార్యక్మం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలంపల్లి దర్గా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులుమహమ్మద్ కరీమొద్దిన్, మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కరీమ్, కార్యదర్శి ఉమర్ ఖురేషి, కోశాధికారి మహమ్మద్ హమీద్, సభ్యులు మహమ్మద్ అర్షద్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ తౌఫిక్, మహమ్మద్ సాజిద్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.