ఆర్ అండ్ బి డి ఈ కి వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు స్పందించిన డి ఈ పై అధికారులకు తెలియ

Published: Friday October 28, 2022
బోనకల్, అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వద్ద సినిమా థియేటర్ చౌరస్తాలో రింగ్ లేకపోవటం వలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే రైల్వే బ్రిడ్జిపై గుంటలు ఏర్పడి ఇనుప చువ్వలు బయటకు రావడం వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అదేవిధంగా ఫ్లై ఓవర్ పై విద్యుత్ లైట్లు లేక చీకటిలో ప్రయాణం చేసే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రమాదాలు నివారించుటకు థియేటర్ వద్ద వెంటనే రింగ్ ఏర్పాటు చేయాలని, బ్రిడ్జిపై ఉన్న గుంటలు మరమ్మత్తు చేయించాలని ఆర్ అండ్ బి డి ఈ రాజశేఖర్, ఎండిఓ వేణుమాధవ్ కి వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఆర్ అండ్ బి డి ఈ వెంటనే స్పందించి థియేటర్ చౌరస్తాలో రింగ్ ఏర్పాటు చేయుటకు రైల్వే బ్రిడ్జి పై ఉన్న గుంటలు నివారించుటకు వెంటనే పై అధికారులకు ఎస్టిమేషన్ పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు ,మోటమర్రి సర్పంచ్ ఇందు, సిపిఎం బోనకల్ గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బిజెపి గ్రామ అధ్యక్షులు గంగుల నాగయ్య, బోనకల్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుడు ఉప్పర శ్రీను, సిపిఎం నాయకులు బిల్లా విశ్వనాథం, గోవిందపురం సహకార సంఘం అధ్యక్షులు మాదినేని వీరభద్రం , గోవిందపురం ఏ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు తన్నీరు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.