నులి పురుగులను నులిపేద్దాం

Published: Thursday September 15, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి.మధిర సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు బుధవారం మాటూరు పేట దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వెంకటేష్ శశిధర్ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అపరిశుభ్ర చేతులు, అపరిశుభ్ర ఆహారము, సరిగా ఉడకని మాంసాహారము తినటం వలన బహిరంగ మలవిసర్జన, షూస్ ధరించకపోవడం ద్వారా ఈ నులిపురుగులు శరీరంలోకి అంటే చిన్న ప్రేవుల్లో నివాసం ఏర్పరచుకొని అక్కడే గుడ్లని పెట్టి పిల్లలు తిన్న బలమైన ఆహారాన్ని అవే తిని పిల్లవాడిని అనారోగ్యవంతుడిగా చేస్తాయని వారు తెలిపారు. తద్వారా పిల్లవాడు రక్తహీనత వచ్చి, నీరసంగా ఉండి చదువులో వెనుకబడిపోతారని వారు అన్నారు. విద్యార్థులు శుభ్రత పాటిస్తూ అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉంటూ ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ మాత్రలను నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని అంగన్వాడి సెంటర్స్, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ వైద్య సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని విద్యార్థులందరూ ఆహారము తీసుకున్న తర్వాత ఆల్బెండజోల్ 400ఎంజి చప్పరించి నవిలి మింగాలని తెలియ పరచి విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు లంకా కొండయ్య సుబ్బలక్ష్మి భాస్కరరావు,శరత్ బాబు, మరియరాణి సిహెచ్ఓ సుభాషిని