గంగారం, ఆలంపల్లి భూములు వేలం

Published: Thursday November 10, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 9 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం, ఆలంపల్లిలో గల ఓపెన్ ల్యాండ్ బహిరంగ వేలంలో పాల్గొనాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. ఆహ్లాదకర పరిసర ప్రాంతాలలో ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ల్యాండ్ ను మీ సొంతం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో  ఈనెల 14న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న బహిరంగ వేలం పాటలో పాల్గొని స్థలం తమ సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల గంగారంలో 3.5 ఎకరాల స్థలం వికారాబాద్ పట్టణం నుండి ద్యాచారంకు వెళ్లే మార్గంలో 475 మీటర్ల దూరంలో ఉంటుందని, స్థానిక రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ నుండి 3.2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. ఎస్ఏపి కళాశాల నుండి1.1 కిలోమీటర్ల దూరంలో కోర్టు కాంప్లెక్స్ పక్కన వికారాబాద్ పట్టణానికి చాలా దగ్గరగా ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుందని తెలిపారు. అలాగే ఆలంపల్లిలో గల 15  ఎకరాల స్థలం కూడా చాలా ఆహ్లాదకర  వాతావరణంలో ఎలాంటి చిక్కులు లేని స్థలం వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ నుండి 7.6 కిలోమీటర్ల దూరంలో, అనంతగిరి గుట్టకు 600 మీటర్ల దూరంలో ప్రశాంతమైన చక్కని వాతావరణంలో ఉంటుందని అన్నారు. వికారాబాద్ మున్సిపల్ లోని గంగారం గ్రామంలో 3.5 ఎకరాల స్థలానికి, ఆలంపల్లి లో గల 15 ఎకరాల స్థలానికి భౌతిక వేలం కొరకు ప్రీ బిడ్డింగ్ సమావేశం ఈనెల 11 న స్థానిక ఆర్. డి. ఓ. కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఆసక్తి గలవారు ఇట్టి సమావేశంలో పాల్గొని పూర్తి వివరాలు సేకరించుకోవచ్చు అన్నారు. వేలం పాటలో పాల్గొనడానికి ధరావత్తు సొమ్ము రూ. 10 వేలు డిడి రూపకంలో జిల్లా కలెక్టర్,  వికారాబాద్ పేరున ఈనెల 13 వరకు అందజేయాలని సూచించారు.  ఈనెల 14న వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో ఉదయం 11:00 గంటలకు బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఎకరానికి కనిష్ట ధర  55 లక్షలుగా నిర్ధారించినట్టు తెలియజేశారు. ఇతర వివరాలకు 7993455775, 9908143341,9000547566 లకు సంప్రదించాలని, https://vikarabad.telangana.gov.in జిల్లా వెబ్ సైట్ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.