మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. -- మున్సిపల్ చైర్మన్ డా.బోగ.శ్రావణి

Published: Monday January 09, 2023

జగిత్యాల, జనవరి 08 (ప్రజాపాలన ప్రతినిధి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళా సాధికారత సాధించిన వారౌతారని జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్  డా.భోగ.శ్రావణిప్రవీణ్ అన్నారు. పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మేరు మహిళల కు ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి శుభాపరిణామమని, మహిళ ల కోసం ప్రభుత్వం తరపున మహిళ సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు ఇవ్వడం జరుగుతుందని, వివిధ రకాల యూనిట్ల ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని,అందుకోసం తన వంతు సహాయసహకారాలు అందివ్వడం జరుగుతుందని 3 అన్నారు. ఈ సందర్భంగా మేరు మహిళలు వేసిన మూడు ఉత్తమ ముగ్గులకు ప్రధమ బహుమతి గట్ల.జాన్సీరాణీ, ద్వితీయ బహుమతి రామగిరి.హారిక తృతీయ బహుమతి రాపర్తి. రాధిక లకు మరియు పాల్గొన్న 40 మంది మేరు మహిళలు, యువతులకు, పిల్లలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేసినారు. 38 వ వార్డు దాసరి లావణ్య ప్రవీణ్ పట్టణ అధ్యక్షుడు మాడిశెట్టి. మల్లేశం, జిల్లా అధ్యక్షుడు గట్ల.రమేష్, పట్టణ ఉపాధ్యాక్షుడు రాగిల్ల. నారాయణ, ప్రధాన కార్యదర్శి రాపర్తి.గణేష్, సహాయ కార్యదర్శి రాపర్తి.రామ, కోశాధికారి మ్యాతరి. మహేష్, జిల్లా కోశాధికారి రామగిరి.శ్రీనివాస్, ప్రశాంత్, బహుమతుల ప్రదాతలు మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్, వోదెల.కమల గంగాధర్, మాజీ కోశాధికారి గట్ల.రాధకిషన్, కొక్కు.శ్రీనివాస్, సంఘ.శ్రీధర్, గట్ల. మాధవి ప్రతాప్, పోల్కం. గంగభావని గాంగధర్, వోదెల యమున శంకరయ్య, పలువురు మేరు మహిళలు, సభ్యులు పాల్గొన్నారు.