ప్రేమెందర్ రెడ్డి ఎమ్మెల్సీ గెలుపుకు కృషి చేయాలి

Published: Thursday February 25, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రస్తుతం జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని చందా మహేందర్ గుప్తా అన్నారు. బుధవారం మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అభ్యర్థి గెలుపుకు ఓ సైనికునిలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బందారపు లింగస్వామి, నాగేల్లి సుధాకర్, రాచకొండ కృష్ణ, మహమూద్, సీలోజు శ్రీరాములు, బచ్చు శ్రీనివాస్, రాములు, అమరెందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.