కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు

Published: Friday November 25, 2022
తల్లాడ, నవంబర్ 24 (ప్రజాపాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మంచి ధరను పొందాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. కేంద్రాలకు తెచ్చే ధాన్యాన్ని మట్టి పెల్లలు లేకుండా తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, గంగాదేవిపాడు సొసైటీ వైస్ చైర్మన్ తూము వీరభద్రరావు, మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్, సీఈవో సాంబశివ రావు, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీలు బానోతూ మోహన్, కోపెల కనకయ్య, నాయకులు శెట్టిపల్లి లక్ష్మణ్ రావు, కల్యానపు కృష్ణయ్య, కల్యాణాపు వెంకటయ్య,  కేతినేని చలపతి, సొసైటీ డైరెక్టర్లు వెంకటరెడ్డి, మువ్వా రామారావు, లక్ష్మీ దేవి, చెరుకూరి గోపాల్ రావు,   ఏఈఓ త్రివేణి, రైతులు పాల్గొన్నారు.