ఘనంగా అయ్యప్ప పడిపూజ

Published: Wednesday December 15, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ సుమారు 1000 మంది అయ్యప్ప స్వాములతో గుండ్ల కృష్ణారెడ్డి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప గురు స్వామి చందర్ నాయర్ సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా మంగళవారం రెడ్డి గార్డెన్స్ లో జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష తో ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది. ఈ సందర్భంగా గురుస్వామి చందర్ నాయర్ మాట్లాడుతూ అయ్యప్ప మాల అంటేనే మనం చేసే సేవ అని, 'సేవలొనే అయ్యప్ప  ఉన్నాడని గురు స్వామి చందర్ నాయర్ అన్నారు. స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ... ప్రపంచం మారుమ్రోగుతోందని ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ పూజలు జోరందుకున్నాయన్నారు. ‘శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం’ అంటూ భక్తులు అచంచల భక్తితో అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో అయ్యప్ప దీక్షను చేపడుతున్నారని, ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడని తెలిపారు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్ష నిదర్శనం అని గురిస్వామి సంబోధించారు. ఈ అయ్యప్ప మహా పడి పూజకు దీక్ష స్వాములు, భక్తులు, ప్రజలు సుమారు రెండు వేల మంది వరకు హాజరై అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని గుండ్ల కృష్ణారెడ్డి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు, వీర్లపల్లి గోపాలకృష్ణ,  మొగిలి గణేష్, అశోక్, తౌటి నరసింహ్మ, గణేష్, గంగి రెడ్డి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, దండుమైలారం సర్పంచ్ మల్లీశ్వరి జంగయ్య, లింగం, ఎంపిటిసి సీతయ్య అనసూయ, శేఖర్ గౌడ్, శ్రీశైలం, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష, టిఆర్ఎస్ యువనాయకులు రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు మొద్దు అంజిరెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.