రాష్ట్ర స్థాయి డప్పు పోటీలో ప్రధమ బహుమతి పొందిన సింధు కళాకారులు

Published: Tuesday July 19, 2022
బోనకల్, జులై 19 ప్రజా పాలన ప్రతినిధి:రాష్ట్రస్థాయి డప్పు విన్యాస పోటీలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహినూర్ మండలంలో శుక్రవారం ప్రారంభం అయి శనివారం రాత్రి ముగిసాయి.ఈ పోటీల్లో బోనకల్ మండలం కలకోట సింధు డప్పు కళాకారుల బృందం పాల్గొని ప్రధమ బహుమతి సాదించారు. కాగా ఈ పోటీల్లో పలు జిల్లాల నుంచి కళాబృందాలు పోటీల్లో పాల్గొన్నాయి.వివిధ జిల్లాల నుండి అందిన ఎంట్రీలను ప్రిలిమినరీ సెలక్షన్స్ ద్వారా ఎంపిక చేసి మెయిన్స్ లో పోటీల నిర్వహించారు. సింధు డప్పు కళాబృందం గత రెండు రోజుల నుంచి జ్యూరీ సభ్యుల ఎదుట డప్పు విన్యాసాలను జతులను ప్రదర్శించి ప్రధమ బహుమతి గెలుచుకొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినుకొండలో జరిగిన నేషనల్ పోటీలో వివిధ రాష్ట్రాల కళాకారులతో పోటీ పడి ద్వితీయ బహుమతి సాదించారు.ఈ పోటీల్లో విజయం సాధించిన బృంద సభ్యులకు మెమంటో తో పాటు నలభై వేలు రూపాయలు నగదుతో బృంద సభ్యులను గౌరవించారు. విజయం సాధించిన సింధు టీం సభ్యులను సర్పంచ్ యంగల దయామణి, డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ గ్రామ పెద్దలు అభినందించారు.
 
 
 
Attachments area