కబ్జాదారుల పై చట్టరీత్య చర్య తీసుకోవాలి.. ఖానాపూర్ గ్రామస్తులు

Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్లో గత 60 సంవత్సరాలగా పెద ప్రజల అధీనంలో ఉన్న భుమిని కొంతమంది కబ్జా దారులు ఫెక్ డాక్యుమెంట్తో అటు కొర్టులను, ఇటు రెవెన్యూ అదికారులను తప్పుదొవ పట్టించి అక్రమించుకొవాలని చుస్తున్నరని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని కొరుచు ఖానాపూర్ గ్రామస్థులు తహసీల్దార్ కు వినతి పత్రము అoదజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నారెడ్డి హరికిషన్ రెడ్డి అనె వ్యక్తి అధ్వర్యంలో కొంతమంది భుమాఫియ బృందంగా ఎర్పడి తప్పుడు పత్రలు సృష్టించి, జగిర్ దార్ల వద్ద భుములు కొన్నమని చెప్పి ఎన్నొ ఎండ్లు గా పేదల ఆధీనంలో ఉన్న భూములను స్వాదినము చెసుకొవాడానికి ప్రయత్నం చెస్తున్నరాని ఆరోపించారు. గతములో ఎంఆర్ఓగా ఉన్న వెంకటెశ్వర్లతో కుమ్మక్కై గ్రామంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ భుములుగా మారుస్తామని తెల్పుతూ పేదప్రజలను మోసం చేస్తున్నారాని, సదరు వ్యక్తులు  మెము కొన్నామని చెప్పుతున్న భుమికి ఇప్పటి వరకు కోర్టుకు గాని, రెవెన్యూ అధికారులకు గాని ఎటువంటి పత్రాలు సమర్పించలేదని ఆరోపించారు. వాళ్ళు చెప్పతున్న 43 సర్వెనెంబర్లో సూమరు  120 ఎకరాలలో ఇంతవరకు టీఫన్ గాని, నక్ష గాని ప్రభుత్వం తయారు చెయ్యలేదు. కాని కబ్జ చెయ్యడానికి ప్రయత్నము చెస్తున్న హరికిషన్ రెడ్డి, అతని అనుచరులు సొంతగానే 43/3 నెంబర్ కు హద్దులు నిర్ణయిస్తున్నారు. సదరు వ్యక్తల పై చట్టరిత్య చర్యలు తిసుకొవాలని వినతిపత్రంలొ కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మున్సిపాలిటీ ప్రదాన కార్యదర్శి మడుపు వెణుగొపాల్ రావు, కార్యదర్శి సిద్దము శివకుమార్, గ్రామ అద్యక్షలు మహేందర్, బిఎస్పి నాయకులు మహెష్, జి రాములు, డి రమెష్, వి వెంకటేష్, డి అంజయ్య, పి దెవయ్య, బి యదయ్య, డి రాములు తదితరులు పాల్గొన్నారు..