సీపీఐ నాయకులు ఆధ్వర్యంలోపెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలి

Published: Saturday June 11, 2022
మధిర  జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మండల పట్టణ కమిటీలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్వీ కాంప్లెక్స్ దగ్గర   ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు బెజవాడ రవి బాబు, ఊట్ల కొండలరావు, మండల రైతు సంఘం అధ్యక్షులు శేషగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా విద్యుత్ ఛార్జీలు బస్ చార్జీలు పెంచడం వల్ల పేదల జీవితాలు చిందరవందరగా తయారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యావసర ధరల పెరుగుదల ఆకాశాన్ని అంటుతున్నాయని వారు విమర్శించారు. అస్సలు రాష్ట్రంలో ప్రభత్వం పనిచేస్తుందా? అనే అనుమానం కలుగుతుందని వారు అన్నారు.ఒక పక్క కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్యాస్,ఎరువుల, పురుగుమందుల, పెట్రోల్,డీజీల్, రైల్వే చార్జీలు, జీ ఎస్ టీ, టాక్స్ లపేరుతో ప్రజలను గుల్ల చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బస్ చార్జీలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులు లోకి నెట్టి వేశారన్నారు.
తక్షణమే ప్రజలకు భారంగా మారిన బస్ ఛార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా పోరాటాలద్వారా మీ కెసిఆర్ రాజరిక పాలనకు చరమగీతం పాడుతామని వారు హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మంగళగిరి రామానుజం ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు మడుపల్లి శాఖ కార్యదర్శి సిరివేరు శ్రీను సహాయ కార్యదర్శి జల్లా భ్రమ్మం షేక్ కొండా, చింతపట్ల కృష్ణ ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు అక్కులు, అంజి, భద్రం తదితరులు పాల్గొన్నారు.