సంక్షేమ పథకాలకు నిధులు మళ్ళించేందుకే భూమి విక్రయాలు

Published: Monday November 14, 2022
* కాంగ్రెస్ పార్టీ పేదలకు 23 లక్షల ఎకరాల భూ పంపిణీ
* వేలం ఆపి దళితులకు భూ పంపిణీ చేయాలి
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 13 నవంబర్ ప్రజా పాలన : సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చేందుకే ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు 23 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది కానీ ఏనాడు ఒక్క ఎకరం భూమి కూడా అమ్మ లేదన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ లోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల వేలం ఆపి దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి కుటుంబాలకు రాజు స్వగృహ ఇండ్లను నిర్మించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దృష్టి అంతా వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించిన భూములపై పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిన భూములు అన్నింటిని టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్ ఉటుందని ఘాటుగా స్పందించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తెచ్చిన రాజు స్వగృహ పథకాన్ని తిరిగి కొనసాగించేందుకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. లావణి భూములకు క్రయవిక్రయాలు జరిపేందుకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి భూములు అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరే అవినీతి చర్యలకు పాల్పడితే పేద ప్రజలను ఆదుకునేది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అటెండర్ స్థాయి నుండి జిల్లా అధికారి స్థాయి వరకు లంచ్ అవతారాలు ఎత్తారని ధజమెత్తారు. రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ చామల రఘుపతి రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ జైదుపల్లి మురళి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎర్రవల్లి జాఫర్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ బిళ్ళ కంటి రాజశేఖర్ రెడ్డి దుద్యాల లక్ష్మణ్ కల్ఖోడ నర్సింలు ముదిరాజ్ కోటమ్మర్పల్లి కృష్ణారెడ్డి సంతోష్ గౌడ్ కొత్తగడి కృష్ణారెడ్డి ఆలంపల్లి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.