ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన మేడిపల్లి, ఆగస్టు28 (ప్రజాపాలన ప్రతినిధి) మథుర చారిటబు

Published: Monday August 29, 2022
ఉప్పల్ గణేష్ నగర్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మథుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉప్పల్  గణేష్ నగర్లోని చైతన్య భారతి హైస్కూల్లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మథుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి.
ఈ మెగ వైద్య శిబిరంలో వందలాది మంది వృద్ధులు, స్త్రీలు, చిన్నా పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ మథుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో రానున్న రోజుల్లో 10 వేల మంది వృద్దులకు కంటి ఆపరేషన్లు, 10 వేల మంది విద్యార్థులకు, 10 వేల మంది మహిళలకు చేయూత అందించేందుకు మథుర చారిటబుల్ ట్రస్ట్ సిద్దంగా ఉంటుందని ఈ సందర్బంగా రాగిడి లక్ష్మారెడ్డి సభ ముఖంగా తెలియ జేశారు. అలాగే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి, అభినవ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి సిబ్బందికి మథుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ శెట్టి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మదర్ వలి, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వంజరి సంతోష్, ఉప్పల్ ఓబీసీ చైర్మన్ పుప్పాల వెంకటేష్,శ్రీధర్ గుప్తా, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి,శ్యామ్, సంజయ్ జైన్, మాలునాయక్ ఎమ్స్ చైర్మన్ షబ్బీర్,వినయ్,భానుగౌడ్,చర్చి కాలనీ రాజు,శాంతి యాదవ్, నారా మహేష్ బాబు, బొల్లు వెంకటరెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ సురేందర్ రెడ్డి, సుదర్శన్, మధుసూదన్ రెడ్డి,నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.