కళాశాలలో మొక్కలు నాటి, కళాశాల సిబ్బందిని సన్మానించిన మండల బిజెపి నాయకులు

Published: Thursday July 07, 2022

బోనకల్ ,జులై 7 ప్రజా పాలన ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ , జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పిలుపుమేరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2022 ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరము నందు అత్యధిక మార్కులు సాధించిన రాష్ట్రస్థాయిలో 4 వా స్థానం సాధించిన జి నీలిమ, 5 వా స్థానం సాధించిన భూక్య సుమాంజలి, 8 వా స్థానం ఎం సాయి సిద్ధార్థ, 9 వా స్థానం వి నిఖిల్, 12 వా స్థానం పి సాహిన్, విద్యార్థులకు కళాశాల ప్రధానాచార్యులు నళిని శ్రీ ని కళాశాల సిబ్బందికు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు ,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్ మాట్లాడుతూ పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే కళాశాలకు మంచి ఉత్తీర్ణత తో పాటు మంచి గౌరవం వస్తుందన్నారు. 2023లో రాష్ట్రస్థాయిలో బోనకల్ ప్రభుత్వ కళాశాల మొదటి స్థానం సాధించాలని విద్యార్థిని విద్యార్థులకు కోరారు, ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల మురళీకృష్ణ ,మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరావు, మండల ఉపాధ్యక్షులు ఇటుకల సైదేశ్వర రావు, మరీదు రామారావు తదితరులు పాల్గొన్నారు.