మాటూరు ఉన్నత పాఠశాలకు సైకిల్ స్టాండ్ నిర్మించిన పారుపల్లి మిత్ర బృందం

Published: Thursday September 22, 2022
మధిర రూరల్ సెప్టెంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు
మాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులలో సైకిల్ స్టాండ్ లేక ఇబ్బందులు పడటం గమనించిన పివిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావు  తన మిత్రబృందo సహాయంతో సైకిల్ స్టాండ్ నిర్మించి, ఈరోజు గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి,శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా సైకిల్ స్టాండ్ ప్రారంభం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు   తెలిపారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులు చేయూతనిస్తే అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చుకొని మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. సైకిల్ స్టాండ్ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం చేసిన మిత్రులు విశ్రాంత ఉపాధ్యాయులు కాలం వీరభద్రం , బాహాటం సత్యనారాయణ రాజు, అన్నెం కోటేశ్వరావు , సన్నిధానం లక్ష్మీ నరసమ్మ కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం పారుపల్లి బృందం ఆంగ్ల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, గణిత ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావులను పూలమాల, దుస్సాలువాలతో సన్మానించి మెమొంటో అందజేయడం జరిగింది.అనంతరం పాఠశాల సైకిల్ స్టాండ్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలు శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు గ్రామ సర్పంచ్ లీలావతి వారిగా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు ఈ కార్యక్రమం కాలం వీరభద్రం, బాహాటం సత్యనారాయణరాజు, అన్నెం కోటేశ్వరావులను గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు  మరియు పాఠశాల సిబ్బంది కలిసి  ఘనంగా సన్మానించడం జరిగింది.