బతుకమ్మ చీరల పంపిణీపై ఎండిఓ ఆఫీస్ లో మీటింగ్

Published: Saturday October 02, 2021
మధిర, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల ప్రజా పరిషత్ ఆఫీసులో బతకమ్మ చీరలు పంపిణీకి అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామవార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్‌ డీలర్‌ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్‌ వార్డు స్థాయిలో బిల్‌ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్‌ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ ద్వారా చీరలు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు