లాక్ డౌన్ ప్రభావంలో శివాజీ చౌక్ చెక్పోస్ట్ సందర్శించిన సి పి మహేష్ భగవత్

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : రాచకొండ సిపి మహేష్ భగవత్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ చెక్ పోస్ట్ ను సందర్శించారు. బాలపూర్ మండలం బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శివాజీ చౌక్  దగ్గర చెక్ పోస్టు ను రాచకొండ సిపి మహేష్ భగవత్ సందర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా తీవ్రతను అరికట్టటానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారంగా లాక్ డౌన్ పటిష్టం చేయడం జరిగిందని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వెహికల్స్ సీజ్ చేసి లాక్డౌన్ పూర్తి అయిన తర్వాత మీ వెహికిల్ ను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు