లఖింపూర్ ఘటనకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Published: Tuesday October 19, 2021
మధిర, అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సిరిపురం మల్లారం గ్రామంర్రైతులపై కాన్వాయ్ తో దాడి చేసి నలుగురు రైతులు పొట్టనబెట్టుకున్న కేంద్ర మంత్రి కొడుకు ను కఠినంగా శిక్షించాలనిరైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలో సిరిపురం రొంపి మల్ల గ్రామాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి  మందా సైదులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర మంత్రి కొడుకు ని కఠినంగా శిక్షించాలని మంత్రిని భర్తరఫ్ చేయాలని; పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని; రైతులు వాడే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ధరలు తగ్గించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు దొంతి వీరాచారి రొంపి మల్ల శాఖ కార్యదర్శి కృష్ణ ప్రభాకర్ హుస్సేన్ మరియు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు