ఎన్నెస్పీ స్థలాలను ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకోవాలి.

Published: Friday June 17, 2022
కాలువ గట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.
 
 
ఆలేరు జూన్ 16 ప్రజాపాలన ప్రతినిధి
ఎన్నెస్పీ స్థలాలను ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్
 
గౌతమ్ అధికారులను ఆదేశించారు. హరితహరం లో కాలవ గట్ల పై మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా పనులను గురువారం పరిశీలించారు. మండలం లోని కోనాయిగూడెం, నేలకొండపల్లి పంచాయతీల్లో కాలువ కట్ట కు
 
ఇరువైపులా మొక్కలు నాటే స్థలాలను పరిశీలించారు. ఎన్నెస్పీ స్థలాల హద్దులు పెట్టకుండా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నెస్సీ కి చెందిన స్థలం కు హద్దులు పెట్టి ఆ తరువాత మొక్కలు నాటాలని సూచించారు. కాలువ కట్టలకు ఇరువైపులా ఉండాల్సిన వెడల్పు ను దగ్గరుండి కొలిపించారు. కాలువ కట్ట పై ముందుగా జంగిల్ క్లియరెన్స్ ను చేపించాలని ఆదేశించారు. దాదాపు అర కిలో మీటర్ వరకు కాలి నడకన నడిచి కాలువ కట్టల పరిస్థితి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలువ కట్టల పై మొక్కలు నాటే కార్యక్రమం అమలు పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. మొక్కలు నాటిన తరువాత వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు
కూసుమంచి-నేలకొండపల్లి రహదారి పొడవునా రహదారి కి ఇరువైపులా ఉన్న
తీసుకోవాలని ఆదేశించారు. కోనాయిగూడెం లో కాలువ కట్టలపై మొక్కలు నాటేందుకు తీసిన గుంతల పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు. అదే విధంగా మొక్కలను చూసి ప్రశంసించారు. నాటటమే కాకుండా. వాటి నిర్వహణ పట్ల వాటిని పెంచి పెద్దవి చేస్తే ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఆయన వెంట డీఆర్డీవో యం.విద్యాచందన, ఎన్నెస్పీ సీఈ శంకర్నాయక్. ఎస్ఈ
అధికారులు పని తీరు బాగుందని ఎంపీడీఓ కె.జమలారెడ్డి కి కితాబు ఇచ్చారు.
నరసింగరావు, వెంకట్రామ్, డీఈఈ మన్మధరావు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్
మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య. తహశీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమాలారెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్ డీఈఈ ఓం ప్రకాష్, యంపీవో శివ, సర్పంచ్లు
పెంటమళ్ల పుల్లమ్మ, రాయపూడి నవీన్, తదితరులు పాల్గొన్నారు.