కుల రహిత సమాజం నిర్మాణమే లక్ష్యం

Published: Wednesday April 12, 2023
* పట్లూర్ సర్పంచ్ ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : కుల రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా బాబూ జగ్జీవన్ రామ్ కృషి చేశారని పట్లూరు గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్ అన్నారు.
మంగళవారం బాబూ జగ్జీవన్ రాం 116 జయంతి సందర్బంగ పట్లూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇందిర అశోక్ అధ్వర్యంలో  అధికారికంగా నిర్వయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మర్పల్లి ఎస్ఐ అరుణ్ కుమార్ ముఖ్యతిదిగా హజరై బాబూ జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ ఇందిర ఆశోక్ మాట్లడుతూ జగ్జీవన్ రామ్ బీహార్‌లోని అర్రా సమీపంలోని చంద్వాలో భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో జన్మించాడు.
కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహిన వర్గాల నేత ప్రముఖ స్వతంత్ర సమరయోదుడు భారత దేశ తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. 
ఇలాంటి మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకొవాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గ్రామంలో ఉన్న  అన్ని వర్గాల ప్రజలు స్నేహ భావంతో శాంతియుతంగా జీవించాలని కోరారు. అనంతరం మర్పల్లి ఎస్ఐ అరుణ్ కుమార్ మాట్లాడుతూ
బాబూ జగజ్జీవన్ రామ్ బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన ఆయన అంటరాని వారికి సమానత్వం కోసం పోరాడారని గుర్తు చేశారు. దేశానికి సుదీర్ఘమైన సేవలనందించిన మహోన్నత వ్యక్తి అని ఈ సంధర్భంగా కొనియాడారు. 
1946లో, అతను జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి,గా 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత దేశానికి  రక్షణ మంత్రిగా పని చేసాడు అన్నారు. యువత చెడు అలవాట్లకు దురంగా ఉండాలని గ్రామ అభివృద్ధిలో బాగస్వామ్యం కావాలని క్షణిక ఆవేశం వల్ల జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి. శంకర్ కె. నర్సింలు గొల్ల ముసలి అశోక్ మోహన్ షఫి అంజయ్య మాజీ ఎంపిటీసీ సురేష్ వార్డ్ సభ్యులు అంజాద్ వికాస్ నందు ప్రకాశ్ ప్రవీణ్ నర్సింలు మధుకర్  మాణిక్యం యువకులు తదితరులు పాల్గొన్నారు.